google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

జులై 4వ తేది కందుకూరు అగ్రికల్చరల్ మార్కెటింగ్ యార్డ్.ప్రాంగణం లో నిర్వహించబోయే పాలకవర్గ ప్రమాణస్వీకారం, ఒక చారిత్రిక ఘట్టంగా నిలిచిపోతుందని,, కందుకూరు నియోజకవర్గం లో అత్యధికంగా దళిత ఓటర్లు ఉన్నా వారికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండ గత పాలకులు చేశారని, నామినేటెడ్ పదవులులలో వారికి కేటయించిన సీట్లను సైతం భర్తీ చేయకుండ దళితుల పట్ల వివక్ష చూపిస్తూ వారి మీద కపట ప్రేమ కురిపిస్తూ వాళ్ళను ఓట్ బ్యాంక్ గానే ఉపయోగించుకున్నారు.దీనికి నిదర్శనమే గతంలో మార్కెటింగ్ చైర్మన్ పదవి దళితులకు కేటాయించిన.దానిని భర్తీ చేయకపోవడమే వాళ్ళకు దళితుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని.దీనిని బట్టి వాళ్ళలో ఉన్న కపట ప్రేమ, కుటిల తత్వం బయట పెట్టుకున్నారని.నాయకులు విమర్శించారు గత పాలకులకు భిన్నంగా ఇంటూరి నాగేశ్వరరావు శాసనసభ్యులు గా గొలుపొందినప్పిటి నుండి దళిత నాయకులతో పాటు Sc,St కాలనీల మీద ప్రత్యేక శ్రద్ద వహిస్తూ వారి అభివృద్ధి పట్ల దృష్టి సారించరని దీనికి ఉదాహరణే కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ AMC చైర్మన్ సీట్లో దళితులను కూర్చోనిపెడుతున్నారని తెలియజేశారు.4వ తేది ఉదయం 10 గంటలకు జరుగు ప్రమాణస్వీకారమహోత్సవం.పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా జరుగుతుందని దానికి సంభదించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని నియోజకవర్గ ప్రజలతో పాటు,ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల లోని గౌరవ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, గౌ,, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, డోలా.శ్రీ బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, పార్లమెంట్ సభ్యులు, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, జోన్ -4 ఇంచార్జి మద్దిపాటి వెంకటరాజు గార్లు తో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాల శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మరియు ఇతర ప్రముఖులను ఆహ్వానించినట్లు నియోజకవర్గ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు రాయపాటి శ్రీనివాసులు, టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, చింతల సింగయ్య, నిరంజన్, రవి తదతరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *