తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని లింగసముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద విగ్రహ నిర్మాణ పనులకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు బుధవారం శంకుస్థాపన చేశారు. MLA నాగేశ్వరావు గారు మాట్లాడుతూ… మండలంలోని పార్టీ నాయకులందరూ కలిసి విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం పట్ల వారిని అభినందించారు. తెలుగుజాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, పేదలకు కూడు, గుడ్డ, నీడ అందించాలన్న సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికీ ఘనంగా జరుపుకోవడం చూస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని నాగేశ్వరరావు అన్నారు. దేవకి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఏర్పాటుచేసిన కమిటీ ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గారు వెల్లడించారు. తనవంతుగా 1,01,116 రూపాయల విరాళాన్ని కమిటీకి ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు అందజేశారు. ఈనెల 4వ తేదీన కందుకూరులోని మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగే నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార వేడుకలకు మండలం నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు పిలుపునిచ్చారు. అలాగే కందుకూరులోని టీఆర్ఆర్ కాలేజీలో వారం రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కాబోతోందని, నిరుద్యోగ యువకులు శిక్షణ పొంది ఉపాధి పొందాలని, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతమైన లింగసముద్రం మండలానికి చెందినవారు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, ప్రధాన కార్యదర్శి అడపా రంగయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్, క్లస్టర్ ఇంచార్జ్ వంకాయలపాటి మాల్యాద్రి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూరిమిట్ల మాల్యాద్రి, పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం, సోంపల్లి మనోహర్, రాజారపు మాలకొండయ్య, షేక్ నాయబ్ రసూల్, గొర్రెపాటి సాంబయ్య, షేక్ రఫీ, చెంచురామయ్య, మద్దెల రామారావు, పల్లపోతు వెంగళరావు, అడపా నరసయ్య, బాలకోటయ్య, సత్యం, బ్రహ్మారెడ్డి, ఇంకా పలు గ్రామాల అధ్యక్షులు, నాయకులు హాజరయ్యారు.
