శనివారం దర్శి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేస్తూ అర్జీదారులకు భరోసా కల్పించారు.అనంతరం త్వరలో దొనకొండ మండలంలో ఏర్పాటు కానున్న బీడీఎల్ (BDL) పరిశ్రమకు సంబంధించి ఆ ప్రాంత రైతులు, టీడీపీ నాయకులతో సమావేశమై పరిశ్రమ ఏర్పాటుపై సమగ్రంగా చర్చించారు.ఇటీవల దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్‌లో జిల్లా కలెక్టర్ గారితో కలిసి పర్యటించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, బీడీఎల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన పురోగతిని పరిశీలించిన విషయం తెలిసిందే.బీడీఎల్ పరిశ్రమ ఏర్పాటుతో వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వెనుకబడిన దొనకొండ ప్రాంత అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *