సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో భారీ స్థాయిలో కేసులు రాజీ ద్వారా పరిష్కారమయ్యాయి. మొత్తం 844 కేసులు విజయవంతంగా పరిష్కారమవడం విశేషం. వీటిలో 24 సివిల్ కేసులు, 148 క్రిమినల్ కేసులు, 672 ఎస్‌టీసీ కేసులు ఉన్నాయి.లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సుదీర్ఘ న్యాయపోరాటాలకు దూరంగా, తక్కువ ఖర్చుతో, పరస్పర అంగీకారంతో శాశ్వత పరిష్కారం పొందినట్లు జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాంసుందరి తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సింగరాయకొండ బార్ అసోసియేషన్, పోలీస్ శాఖ, కోర్టు సిబ్బంది అందించిన సహకారం కీలక పాత్ర పోషించింది. చిన్న పట్టణమైన సింగరాయకొండలో ఒకేరోజు 844 కేసులు పరిష్కారం కావడం న్యాయ వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *