తొలి శుభోదయం న్యూస్ కామేపల్లి:-
కామేపల్లి శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం కరెంటు స్తంభానికి ఢీకొట్టిన కారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.AP40LD7911 బ్రీజా కారు లో శ్రీ కామేపల్లి పోలేరమ్మ తల్లి అమ్మవారి దర్శనార్థం కోసం వచ్చారు. ఆలయం వద్ద మందు త్రాగటం మానుకునేందుకు తాయత్తు కట్టించుకునే వద్ద వీరికి, మరొకరికి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ సమయంలో వారు ఇరువురు మధ్య చిరుగుపాటి ఘర్షణ జరిగింది. ఘర్షణ అనంతరం అతివేగంతో కారు తోలుతూ కామేపల్లి గ్రామం మొదట్లో ఉన్న మలుపు వద్ద కారు అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీ కొట్టి, సైడుకాలంలోకి దూసుకుని వెళ్ళింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏమి ప్రమాదం జరగలేదు.