తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండలో సోమవారం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన జరిగిన BLAల సమావేశంలో సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు మసనం వెంకట్రావు ఆధ్వర్యంలో ఊళ్లపాలెం గ్రామ వైఎస్సార్సీపీ అధ్యక్షులు పాకనాటి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఊళ్లపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ BLAలు బూత్ నంబర్ 276 – తంబు నాగార్జున, 277 – రేణుమాల వెంకట్రావు, 278 – అవనిగడ్డ పున్నయ్య, 279 – కాళహస్తి వెంకటరెడ్డి, 280 – పాకనాటి సుబ్బారెడ్డి పాల్గొని, ఊళ్లపాలెం పరిధిలో SIR ప్రక్రియలో భాగంగా BLOలతో కలిసి ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.అలాగే ప్రతి ఓటరికి ఎన్యుమరేషన్ ఫారాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఒక్క ఓటరు కూడా తన ఓటు కోల్పోకుండా తమ వంతు కృషి చేస్తున్నామని డాక్టర్ ఆదిమూలపు సురేష్‌కు తెలియజేశారు.