ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, టంగుటూరు గ్రామానికి చెందిన డాక్టర్ ఎం. స్నేహరాగ సౌజన్య కృత్రిమ మేధస్సు ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిశోధనలో డాక్టరేట్ పట్టా సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో “కృత్రిమ మేధస్సు ఆధారిత ముందస్తు విశ్లేషణలతో ఆరోగ్య సంరక్షణ నిర్వహణ” అంశంపై చేపట్టిన పరిశోధనకు గాను కాన్పూర్‌లోని ఛత్రపతి సాహూజీ మహారాజ్ విశ్వవిద్యాలయం వారు 2026 జూలై 16న డాక్టరేట్ అవార్డును ప్రదానం చేశారు.ప్రస్తుతం ఆమె ఏవీఎన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సహాయ ఆచార్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు కృత్రిమ మేధస్సు వినియోగంపై ఆమె చేసిన పరిశోధనకు విద్యావేత్తలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.టంగుటూరు గ్రామానికి చెందిన యువ పరిశోధకురాలు ఈ ప్రతిష్టాత్మక డాక్టరేట్ సాధించడం పట్ల విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, సహచర అధ్యాపకులు, విద్యార్థులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆమె విజయం ప్రకాశం జిల్లాకు గర్వకారణమని, యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *