తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
తాళ్లూరు మండలం, తోటవేంగన్నపాలెం గ్రామంలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం – కూటమి ప్రభుత్వ రెండేళ్ల నమ్మకం… అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తోటవేంగన్నపాలెం గ్రామంలో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్రామీణ సురక్షిత మంచినీటి వాటర్ ప్లాంట్‌ను దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభించారు.గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.