మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, దోర్నాల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో ఈగిల్ (EAGLE) టీం సమన్వయంతో జమ్మి దోర్నాల గ్రామంలో గంజాయి నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులకు, యువతకు గంజాయి వినియోగం, సాగు, రవాణా మరియు విక్రయాలు చట్టరీత్యా శిక్షార్హమైన నేరాలని వివరించారు. మాదకద్రవ్యాల వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ జీవితం, సమాజ భద్రతపై కలిగే దుష్పరిణామాలను తెలియజేస్తూ, గంజాయి సంబంధిత సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *