తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి నియోజకవర్గ పరిధిలోని ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజబాబు గారు , నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి గారు మరియు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గారు సంయుక్తంగా నిర్వహించారు.
ముఖ్యాంశాలు: 176+ అర్జీలు స్వీకరణ: ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 176కి పైగా వినతులు వచ్చాయి (ఇందులో 127 రెవెన్యూ, DRDA-6, RWS-6 మరియు ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి). క్షేత్రస్థాయిలోనే పరిష్కారం: అధికారులే స్వయంగా అర్జీదారుల ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకొని, వారు సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయిలోనే పరిష్కరిస్తారు.త్వరితగతిన చర్యలు: ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక సంబంధిత వినతులను సంబంధిత శాఖలకు పంపడం జరిగింది.