ఆగస్టు 15న స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా, దేశభక్తి ఉప్పొంగేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారితో కలసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమైన అంశాలు: సాంస్కృతిక ప్రదర్శనలు: మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు మత సౌబ్రాతృత్వాన్ని ప్రతిబింబించేలా పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు. ప్రభుత్వ శకటాలు & స్టాళ్లు: వివిధ శాఖల అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించే ప్రత్యేక శకటాల ప్రదర్శన మరియు స్టాళ్ల ఏర్పాటు. పటిష్ట బందోబస్తు: వేడుకల ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత, పోలీస్ బ్యాండ్ మరియు కవాతు ఏర్పాట్లు. ప్రోటోకాల్ పాటించడం: VIP గ్యాలరీ, డయాస్ నిర్వహణతో పాటు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి గారు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి గారు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *