ప్రజలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ఓపెన్ బూజింగ్ (బహిరంగ మద్యం సేవ) ప్రదేశాల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టారు.జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు, అక్కడ మళ్లీ ఎవరూ చేరకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే బహిరంగ మద్యం సేవను పూర్తిగా అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. బహిరంగ మద్యం సేవ, అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *