ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు మరింత వేగంగా చేరవేస్తూ, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో ఈనెల 07వ తేదీన (శుక్రవారం) గిద్దలూరు నియోజకవర్గంలో ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు’ (One Month, One Constituency, Four Visits) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.అర్ధవీడు గ్రామం / మండలం లోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంలో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.ప్రజల ఫిర్యాదుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన కోసం జిల్లా స్థాయి అన్ని శాఖల అధిపతులు (District HoDs), ​గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, మండలాభివృద్ధి అధికారులు (MPDOs), ​గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ హాజరుకానున్నారు​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ, అర్ధవీడు మండలంతో పాటు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తమ అర్జీలు, సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని సూచించారు. అధికారులు ఎటువంటి అలసత్వం వహించకుండా, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *