జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా కొత్తపట్నం పోలీసులు మోటుమాల గ్రామంలో జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో 7 మంది జూదరులను పట్టుకొని, వారి వద్ద నుండి రూ. 3,080/- నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.జిల్లాలో జూదం, మద్యం, మాదకద్రవ్యాలు మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *