తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
హెచ్ఎంపాడు మండలం వీర్రాంపురం గ్రామానికి చెందిన 13 వైకాపాకుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో కనిగిరి అమరావతి మైదానంలో తెదేపాలో చేరారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లో కనిగిరి నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంతలపాడు మండల టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి నాయకులు కోటపాటి శేషయ్య చీకటి వెంకటసుబ్బయ్య తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.