గుడ్లూరు మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజులు 11 నుండి 13వ తేదీ వరకు జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం జరుగుతున్నది . ఈ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు డిఆర్పీలు ఏ. విజయ్ కుమార్ గారు, టి. చంద్రశేఖర్ గారు, కె. కామేశ్వరి గారు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో హాజరైన కార్యకర్తలకు అంగన్వాడీ కేంద్రంలో వచ్చే పిల్లలను లింగ బేధం లేకుండా చూడాలని, లింగం కారణంగా అన్యాయంగా చూడకూడదు లేదా వారికి అవకాశాలు నిరాకరించకూడదు. ప్రతి ఒక్కరూ సమాన హక్కులు విలువలు కలిగి, అన్నిటిలోనూ పాల్గొనే అవకాశం ఇవ్వాలని వారికి తెలియజేయడమైనది. ఉదాహరణకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రతి క్రీడలో పాల్గొనే అవకాశాన్ని కల్పించాలి అని తెలియజేయడమైనది. అలానే అంగన్వాడీ సెంటర్ కి వచ్చే లబ్ధిదారులకు పోషణ మరియు ఆరోగ్యం గురించి వారికి అవగాహన కల్పించడం అయినది. బాలల రక్షణ మరియు అవసరాలకు అనుగుణమైన సంరక్షణ గురించి వారికి తెలియజేయడమైనది. అంగన్వాడి స్కూల్ నుంచే పిల్లలకు ఇంగ్లీషు భోదించడం గురించి అంగన్వాడీ టీచర్ లకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాలపై కార్యకర్తలకు ఈ మూడో రోజుల శిక్షణా కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ -1 బి. హరి రామ్ గారు, గుడ్లూరు హైస్కూల్ హెచ్ఎం ఇన్చార్జి మురళి గారు, కే ఆర్ పి పి. వాణి గారు హాజరై వారి సందేశాన్ని కూడా అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేసినారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *