గయాల్, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో ఒంగోలు ఆర్డీవో, కొండపి,మర్రిపూడి, జరుగుమల్లి, టంగుటూరు, పొన్నలూరు మండలాల తహసీల్దార్లతో మంత్రి డా.స్వామి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…కొండపి నియోజకవర్గంలో గయాల్ భూములు ఆన్ లైన్ లో నమోదు కాకపోవడం, గతంలో పాసుపుస్తకాలు ఉన్నప్పటికీ 22ఏ లో నమోదు కావడం వంటి సమస్యలతో వేలాదిమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరించాలని, జిల్లా స్థాయిలో పరిష్కారం కాని భూ సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుని అర్హులైన పేదలకు భూమి హక్కులు కల్పించాలని, నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *