దేశ ​80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం అధికారిక వేడుకగానే కాకుండా ప్రజా భాగస్వామ్యంతో ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన పూర్వీకులు, స్వాతంత్య్ర సమరయోధుల అపార త్యాగాల ఫలితంగానే నేడు మనకు ఈ స్వేచ్ఛ, ఆత్మగౌరవం లభించాయని, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు దేశం సాధించిన మైలురాళ్లను స్మరించుకుంటూ రాబోయే తరాలకు ఈ స్ఫూర్తిని అందించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. “వికసిత భారత్ – 2047” లక్ష్య సాధనలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని ఆయన కోరారు. ఐఏఎస్ అధికారులు, వైద్యులు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తల నుండి విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ తాము దేశాభివృద్ధికి ఏ విధంగా సేవ చేస్తారో వివరిస్తూ స్వచ్ఛందంగా సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు (SHGs), యువత, విద్యార్థులు, పౌర సమాజం మరియు సాధారణ ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
​ముందస్తు వేడుకలు ఇలా…​✓డిజిటల్ వీడియో ప్రచారం & “అనే నేను” క్యాంపెయిన్ (ఆగస్టు 10 నుండి 15): ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు పౌరులు “వికసిత భారత్ – 2047” సాధనలో తమ పాత్రను వివరిస్తూ చిన్న వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పంచుకుంటారు. ✓​పాఠశాలల్లో ” నేను – నా దేశం” (“అనే నేను”) ప్రతిజ్ఞ (ఆగస్టు 10 నుండి 15): ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులు భవిష్యత్తులో తాము ఏమి కావాలనుకుంటున్నారో, దేశాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతారో స్వీయ ఆలోచనతో ప్రతిజ్ఞ చేస్తారు. అత్యుత్తమ ఆలోచనలను స్వాతంత్య్ర దినోత్సవం రోజున సత్కరిస్తారు. పాఠశాల విద్య, సర్వశిక్షా అభియాన్, ఇంటర్మీడియట్ మరియు కాలేజ్ ఎడ్యుకేషన్ శాఖలు దీనిపై ముఖ్యంగా చర్యలు తీసుకుంటాయి.
✓ ​తిరంగా సైకిల్ ర్యాలీలు (ఆగస్టు 12 నుండి 15):
కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ సందేశంతో జిల్లాలోని అన్ని మండలాలు మరియు జిల్లా కేంద్రంలో త్రివర్ణ పతాకాలతో తిరంగా సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తారు. ర్యాలీ ముగింపులో ప్రధాన స్థలంలో పౌరులందరితో ప్రతిజ్ఞ చేయిస్తారు.
✓ ​హర్ ఘర్ తిరంగా (ఆగస్టు 13 నుండి 15): రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో కలిసి పాల్గొంటారు. మహనీయుల విగ్రహాలు, సెంటర్లలో జెండాలతో సెల్ఫీలు/వీడియోలు తీసి ‘ హర్ ఘర్ తిరంగా . కామ్ ‘ వెబ్ సైట్ లో అప్‌లోడ్ చేస్తారు. దీనికి మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్, స్వచ్ఛ గ్రామ స్వచ్ఛ వార్డు, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలు సమన్వయం వహిస్తాయి. ✓ ​మొక్కల పెంపకం మరియు ప్రతిజ్ఞ – మాస్ ప్లాంటేషన్ (ఆగస్టు 14): అటవీ, ఉద్యానవన శాఖల సహకారంతో జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజే భారీగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. “నా ఆశయం లాగే ఈ మొక్క కూడా ఎదగాలి” అనే భావనతో, నాటిన మొక్కల వద్ద చేతిలో జాతీయ జెండా పట్టుకుని దేశ నిర్మాణం కోసం తమ వంతు కృషి చేస్తామని, మొక్కను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ✓ ​మువ్వన్నెల వెలుగుల కాంతులు – తిరంగా ఇల్యూమినేషన్ (ఆగస్టు 14 మరియు 15): ప్రభుత్వ భవనాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన జంక్షన్లు మరియు ముఖ్యమైన పబ్లిక్ ప్రాంతాలను జాతీయ పతాక రంగుల (త్రివర్ణ) విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా అలంకరిస్తారు.
సోషల్ మీడియా హ్యాష్‌ట్యాగ్‌లు: సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలకు క్రింది హ్యాష్‌ట్యాగ్‌లను తప్పనిసరిగా జత చేయాలని జిల్లా యంత్రాంగం కోరింది:

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *