తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
అమరావతి ఛాంపియన్‌షిప్ చెస్ సెలక్షన్స్‌లో సింగరాయకొండకు చెందిన సయ్యద్ మాహియా, సయ్యద్ షఫీజ్ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు.శాప్ ప్రకాశం ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆనంద్ మినీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ చెస్ సెలక్షన్స్‌లో అండర్-23 మహిళల విభాగంలో సయ్యద్ మాహియా మొదటి స్థానం సాధించారు.అదేవిధంగా అండర్-17 బాలుర విభాగంలో సయ్యద్ షఫీజ్ రెండో స్థానం సాధించి ప్రతిభ చాటారు.ఈ విజయంతో వీరిద్దరూ తదుపరి తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌లో ప్రకాశం జిల్లా తరఫున బరిలోకి దిగనున్నారు.జిల్లాస్థాయి సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మాహియా, షఫీజ్‌లను పలువురు అభినందిస్తూ, రాష్ట్రస్థాయిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.