జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రెబ్బ వెంకటేశ్వర్లు…
తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:-
అంగన్వాడి కేంద్రాల చిన్నారులకు మెరుగైన బోధన అందించడమే లక్ష్యంగా ఈ జ్ఞాన జ్యోతి ట్రైనింగ్ నిర్వహించడం జరిగిందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెబ్బ వెంకటేశ్వర్లు అన్నారు, మండల కేంద్రమైన మర్రిపూడి జడ్పీహెచ్ హైస్కూల్లో జరిగిన మూడవరోజు జ్ఞాన జ్యోతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు,డిఆర్పీలు ప్రసంగిస్తూ చిన్నారుల వయసుకు అనుగుణంగా ఆటలు పాటలు కథలు చిత్రాలు వివిధ కార్యకలాపాల ద్వారా బోధన పద్ధతులను కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిఆర్పీలు అశోక్ బాబు వాసు బాబు ప్రసాద్ రావు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.