తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తాళ్లూరు మండల మాజీ టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి గారు ఈరోజు దర్శిలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ–కడియాల లలిత్ సాగర్ దంపతులను, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండల టీడీపీ అధ్యక్షులు మేడం వెంకటేశ్వర్ రెడ్డి, క్లస్టర్ రాచకొండ వెంకట్రావు, నవ్వులూరి విద్యాసాగర్, మండల వైస్ ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వర్ రెడ్డి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.