తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులు మరియు అధ్యాపకులు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు కందుకూరులోని కోవూరు రోడ్లో మానవహారం ఏర్పాటు చేసి జాతీయ సమైక్యతను పెంపొందించే నినాదాలను నినదించారు ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ మంచిగా చదువుకోవడం తోపాటు దేశభక్తితో మెలగాలని, దేశ అభ్యున్నతికి పాటుపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హోమియో డాక్టర్ గారైన డాక్టర్ పి.రత్నావళి మరియు ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ అయినా డాక్టర్ ఆర్. టి. యస్. లక్ష్మి కుమారి, పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను, ప్రతి విద్యార్థి దేశం పట్ల తమ బాధ్యతను గుర్తించి ఏ విధంగా మెలగాలో వివరించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం మరియు ఫిజికల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మరియు రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ కె వి పద్మావతి, పిడి శ్రీ కరుణ రత్నకుమార్, అధ్యాపకులు డాక్టర్ ఎన్వి. శ్రీహరి, డాక్టర్ పి. రాజగోపాల్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఎన్. తిరుపతి స్వామి, శ్రీ బి. కమల బాబు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.