తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఎలాంటి దొంగచాటు విక్రయాలు జరిపినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు..ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తారు..నిబంధనలు ఉల్లంఘించే దుకాణాల లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తారు..అక్రమంగా మద్యం నిల్వ చేసినా లేదా విక్రయించినా కఠినమైన కేసులు నమోదు చేస్తాం.. సింగరాయకొండ ఎక్సైజ్ సీఐ శివ కుమారి..శాంతిభద్రతల పరిరక్షణ
వేడుకల సమయంలో మద్యం సేవించి గొడవలు చేయడం నిషేధమని,
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు..ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు..జాతీయ పండుగను కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు…సర్కిల్ పరిధిలో ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఎక్సైజ్ లేదా పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.