తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సివిల్ జడ్జి డాక్టర్ వి. లీల శ్యామసుందరి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని వక్తలు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు న్యాయం అందించడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయ విలువలను పరిరక్షించాలని మరియు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.కార్యక్రమంలో సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాది కొల్లూరు వెంకట నరసింహారావు, న్యాయవాదులు రాయి రమేష్ రాఘవేంద్ర, పంతగాని వెంకటేశ్వర్లు, వంశీ, శ్రీలక్ష్మి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.అలాగే కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు ఇతరులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. కోర్టు ప్రాంగణం జాతీయ జెండా రెపరెపలతో, దేశభక్తి నినాదాలతో సందడిగా మారింది.