తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు . అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా దేశానికి లభించిన స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, స్వేచ్ఛా భారతదేశం సాధించిన ప్రగతిని భావితరాలు సద్వినియోగం చేసుకునేలా బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జ్ ఈఓ రంగరాజు, ఆలయ కార్యాలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.