తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS), పాకలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు భారీ మువ్వన్నెల వస్త్రాన్ని చేతబట్టి ప్రత్యేకంగా ప్రదర్శించి దేశభక్తిని చాటారు. పాఠశాల మైదానంలో విద్యార్థులంతా కలిసి త్రివర్ణ పతాకం చుట్టూ నిలబడి నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అనంతరం విద్యార్థులు మువ్వన్నెలతో ర్యాలీ నిర్వహిస్తూ దేశభక్తి స్ఫూర్తిని చాటారు. పాకల ZP హైస్కూల్ విద్యార్థుల మువ్వన్నెల ప్రదర్శన ఆకట్టుకుంది.