మార్రిపూడి పోలీసులు జువ్విగుంట గ్రామంలో జూదం ఆడుతున్న వారిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ₹9,690 నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మార్రిపూడి పోలీసులు హెచ్చరించారు. ప్రజలు జూదానికి దూరంగా ఉండాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *