తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరిగాయి. దేశభక్తి నాయకుల వేషధారణలో విద్యార్థులు అలరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్కూల్ కరెస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, దేశభక్తి ఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించింది. ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ
వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ సైకం శ్రీవిద్య మాట్లాడుతూ మన దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుతూ ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. యువత శక్తిని దేశ నిర్మాణానికి వినియోగిస్తూ, విద్య, సేవ, క్రమశిక్షణ మరియు సమాజ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయిలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.మన త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ గర్వంగా రెపరెపలాడాలని, మన భారతదేశం అభివృద్ధి, శాంతి, సౌభ్రాతృత్వంతో ప్రపంచంలో మరింత ఉన్నత స్థానాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
