విద్యార్థినులకు రక్త గ్రూప్ అవగాహన ముఖ్యం:
ఘనంగా బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు
తొలి శుభోదయం న్యూస్ కావలి:-
స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఏపీఎస్‌డబ్ల్యూ, ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు ఆదివారం ఉదయం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కావలి బృందం ఆధ్వర్యంలో బ్లడ్ గ్రూపింగ్ నిర్ధారణ శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో దాదాపు 160 మందికి పైగావిద్యార్థినులకు రక్త గ్రూప్ పరీక్షలు నిర్వహించి, సంబంధిత బ్లడ్ గ్రూప్ గుర్తింపు కార్డులను అందజేశారు. విద్యార్థినులకు తమ బ్లడ్ గ్రూప్‌పై అవగాహన కల్పించడం, అత్యవసర సమయాల్లో రక్త సమాచారం వెంటనే అందుబాటులో ఉండేలా చూడటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ శ్రీ కె.హరినారప రెడ్డి, హాస్టల్ వార్డెన్లు శ్రీమతి ప్రసూన, శ్రీమతి సునీత, శ్రీమతి మంజులలతో పాటు రెడ్‌క్రాస్ సిబ్బంది డి. పద్మావతి, శేషమ్మ, అనిల్, రెడ్‌క్రాస్ హాస్టల్ కమిటీ సభ్యులు ఎస్.స్వర్ణలత, రజని,ట్యూషన్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.