తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :-
ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆకాంక్ష అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కాకుటూరు వారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ని మంత్రి ప్రారంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. పేదల విద్య, వైద్యం ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వైసీపీ హయాంలో పేద ప్రజల ఆరోగ్యానికి గాలికొదిలి వైద్య శాఖను నిర్లక్ష్యం చేశారన్నారు. నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం మందులు కూడా దొరికే పరిస్థితి లేదన్నారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పి 4 తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు పేదలకు మేలు చేస్తుంటే..వైసీపీ ఓర్వలేక రాష్ట్రంలో శవ, కుల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. వైసీపీ ఓ విషవృక్షం ప్రజలు దాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలని లేకుంటే రాష్ట్రానికి ప్రమాదకరమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.