తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
తాళ్లూరు మండలంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో తూర్పు గంగవరం గ్రామానికి చెందిన దాదాపు 30 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి సమక్షంలో పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మండల, గ్రామ మైనార్టీ విభాగాల నాయకులు, వివిధ అనుబంధ కమిటీల ప్రతినిధులు, విద్యార్థి విభాగ నాయకులు, యువతతో పాటు పలువురు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తూర్పు గంగవరం నుంచి టీడీపీలో చేరిన ప్రముఖులు:
▪️ లతీఫ్ (బచ్చా) – మండల మైనార్టీ అధ్యక్షులు
▪️ ఫాజులు – గ్రామ మైనార్టీ అధ్యక్షులు
▪️ ఫజుల్ – గ్రామ అనుబంధ కమిటీ
▪️ మదర్ వలి – ప్రధాన కార్యదర్శి
▪️ అబ్దుల్ ఖాదర్ జిలానీ – ప్రధాన కార్యదర్శి
▪️ సందాని – ప్రధాన కార్యదర్శి
▪️ కస్ మూర్ వలి – కార్యదర్శి
▪️ సైదా – కార్యదర్శి
▪️ అన్వర్ – కార్యదర్శి
▪️ చిన్న లతీఫ్ – కార్యదర్శి
▪️ హుస్సేన్ బాషా – కార్యదర్శి
▪️ షరీఫ్ – కార్యదర్శి
▪️ అబ్దుల్ సలాం, కలిశా, అబ్దుల్ కలాం – ప్రధాన కార్యదర్శులు
▪️ ఖాసిం బాషా – యువత కార్యదర్శి
▪️ పాలు – మండల విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి
వీరితో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.
“అభివృద్ధి – సంక్షేమం.. గొట్టిపాటి కుటుంబ నాయకత్వంపై నమ్మకంతో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు