ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈవ్ టీజింగ్ నివారణలో భాగంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల వద్ద డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు.విద్యార్థినులు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కీలక ప్రాంతాల్లో పోలీసుల పర్యవేక్షణను ముమ్మరం చేశారు. ఈవ్ టీజింగ్, మహిళలను వేధించడం లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.మహిళలు, బాలికల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని, ప్రజలు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *