వెనుకబడిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం కోసం విశేష కృషి చేసిన బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బి.పి. మండల్) జయంతి వేడుకలను మంగళవారం గిద్దలూరులో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బి.పి. మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ నాయకులు, సంఘాల ప్రతినిధులు ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి జాడి శ్వేత మాట్లాడుతూ, దేశంలోని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల పరిస్థితులను అధ్యయనం చేసి వారికి సముచిత అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మండల్ కమిషన్ చేసిన సిఫార్సులు భారతదేశంలో సామాజిక న్యాయ సాధనకు కీలక మలుపుగా నిలిచాయని పేర్కొన్నారు.“వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, పాలనలో సమాన అవకాశాలు లభించాలనే లక్ష్యంతో బి.పి. మండల్ చేసిన కృషి చిరస్మరణీయం. బీసీల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం” అని అన్నారు.మండల్ ఆశయాలను కొనసాగిస్తూ బీసీల విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం మరియు సామాజిక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని 139 కులాల రాష్ట్ర జనరల్ సెక్రటర్ ఓ.వెంకటయ్య యాదవ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ బి.సి.సంక్షేమ సంఘము అధ్యక్షుడు అద్దంకి. మధుసూధనరావు,వాల్మీకి సంఘము నాయకులు నల్లబోతుల వెంకటేశ్వర్లు, శాలివాహన సంఘము నాయకులు సుండి.వెంకటరమణ,రజక సంఘ అధ్యక్షుడు పాలకవీటి బాలచెన్నయ్య ,రజక సంఘ వైస్ ప్రెసిడెంట్.అలసందల.పాండు, ఇతర బి.సి.నాయకులు పాల్గొని బి.పి. మండల్‌కు నివాళులర్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *