గిద్దలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల క్రైమ్, ఎన్‌డిపిఎల్, ఎన్‌డిపిఎస్, బైండ్‌ఓవర్ అలాగే చార్జ్‌షీట్ కేసుల పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు.పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని స్టేషన్ సిబ్బందికి తగిన దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో పాత ఎన్‌డిపిఎల్ కేసుల్లోని నిందితులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం గిద్దలూరు పట్టణంలోని పలు మద్యం దుకాణాలను ఒంగోలు ఎఈఎస్ ఏ.జనార్దన్ రావు తో కలిసి ఆమె తనిఖీలు చేశారు. దుకాణాలకు సంబంధిత రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు, ‘ఎక్సైజ్ సురక్ష యాప్’ ద్వారా కొన్ని మద్యం బాటిళ్లను యాదృచ్ఛికంగా స్కాన్ చేసి వాటి అసలు వివరాలను ఆమె నిశితంగా పరిశీలించారు.
ఈ తనిఖీల సందర్భంగా తక్కువ ఆఫ్‌టేక్ నమోదవుతున్న షాపుల లైసెన్సుదారులు ప్రస్తుత నెల నిర్దేశిత ఆఫ్‌టేక్ లక్ష్యాన్ని సాధించేలా తగినంత మద్యం స్టాక్‌ను సకాలంలో లిఫ్ట్ చేసుకోవాలని స్పష్టం చేశారు.నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం దుకాణదారులు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ ఎం.జయరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *