తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన గౌరవ కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు.ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ రావు గారు, జోనల్ కోఆర్డినేటర్ శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు, గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్ గారు మరియు జిల్లా అధికారులతో కలిసి పర్యటనకు సంబంధించిన వేదిక, భద్రత, ప్రజా సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర ఏర్పాట్లను పరిశీలించారు.మంత్రి గారి పర్యటన విజయవంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *