తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద భీమా, ప్రమాదం జరిగి చికిత్స పొందే సమయంలో హాస్పటలైజేషన్ బీమాతొ పాటు 14 సంక్షేమ పథకాలను అమలు చేయాలని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం(iftu) రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఆర్, మోహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈరోజు సింగరాయకొండ మండల కేంద్రంలో శాంతి హాల్ వద్ద భవన నిర్మాణ కార్మికుల అడ్డాపై భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం(iftu) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి హాజరైన వారిని మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించి 14 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని కానీ మార్చి 1వ తేదీన విడుదల చేసిన సర్క్యులర్ లొ 14 సంక్షేమ పథకాలు కాకుండా మూడు పథకాలు మాత్రమే ప్రకటించా రని ప్రధానంగా భ వననిర్మాణ కార్మికులకు ప్రమాద బీమాను అమలుచేసి, ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పటల్లో చికిత్స పొందుతున్న పవన్ నిర్మాణ కార్మికులకు గతంలో అమలు చేసిన విధంగా హాస్పటలైజేషన్ అలవెన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల కార్మికుల అగ్రహ నికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు, ఇంకా ఈ కార్యక్రమంలో అఖిలభారత్ రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ కే నాంచార్లు పవనిర్మాణ కార్మిక సంఘం నాయకులు డొక్కా కోటేశ్వరావు ఈశ్వరయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు