తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
ప్రకాశం జిల్లా గుడ్లూరుకు చెందినటువంటి నేత్రపురి శ్రీరామసేవక్ ఆధ్వర్యంలో గుడ్లూరు మండలం తెట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నటువంటి 60 మంది విద్యార్థులకు దాతల సహకారంతో నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, ఎరైజర్లు అలాగే స్కూల్లోని 120 మంది విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేత్ర పూరి శ్రీరామ సేవక్ నిర్వాహకులలో ఒకరైనటువంటి ఎయిర్టెల్ చిన్న మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు వినయన్ని,,సంస్కారాన్ని నేర్చుకోవాలని, విద్యార్థులు చిన్నప్పటినుంచి సత్యాన్ని పలుకుతూ, సేవాగుణాన్ని అలవాటు కోవాలని అలాగే మీరు చదువుకున్న స్కూలుకి మీ తల్లిదండ్రులకు మీ గురువులకు మంచి పేరు తీసుకురావాలని, తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని సూచించారు. అలాగే మీరు చక్కగా ఉన్నత విద్యలను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదిగి మీ తదుపరి తరాలకు ఇలాంటి సేవలను అందియాలని విద్యార్థులకు ఉపదేశించారు. మేము గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాతలు సహకారంతో స్కూల్ విద్యార్థులకు ఈ నోట్ పుస్తకాలు,పెన్సిళ్లు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. అలాగే ప్రధానోపాధ్యాయులు చిన్నయ్య సార్ గారు మాట్లాడుతూ విద్యార్థులు దాతల యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు విద్యలో రాణించి పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అలాగే గత సంవత్సరం నుంచి హై స్కూల్లో విద్యా సంవత్సరం ఆరంభం నుంచి విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రతి రోజు అవసరం ఉన్నన్ని మంచినీటి కూలింగ్ క్యాన్లను ఉచితంగా అందిస్తున్నటువంటి మంచినీటి దాత ముక్కాల మోహన్ రావు గారిని హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు చిట్యాల చిన్నయ్య సార్ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఆ తదుపరి స్కూల్లోని ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర ఉపాధ్యాయులు నేత్రపురి శ్రీరామసేవక్ నిర్వాహకులు ఇన్నమూరి సుధాకర్ గారిని, ఎయిర్టెల్ చిన్నగారిని అలాగే మంచినీటి దాత అయినటువంటి ముక్కాల మోహన్ రావు గారిని శాలవులతో సత్కరించి, అభినందించడం జరిగింది. ఆ తదుపరి విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేత్రపురి శ్రీరామసేవక్ నిర్వాహకులు ఇన్నమూరి సుధాకర్, ఎయిర్టెల్ చిన్న మరియు ముక్కాల మోహన్ రావు గారు, జలగం అశోక్, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు చిన్నయ్య గారు మరియు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.