తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో తర్లుపాడు పీఎస్ ఎస్ఐ గారు నాగెళ్లముడిపి గ్రామంలోని జెడ్పీహెచ్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమై, వారి సమస్యలు మరియు భద్రతకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, బాలలపై జరిగే నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురికాకుండా అపరిచిత ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు మరియు OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. బాలలపై ఎలాంటి నేరాలు లేదా వేధింపులు జరిగినా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత – నేరాల నియంత్రణలో అవగాహనే కీలకం అని పోలీసులు పేర్కొన్నారు.