ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గ్యాస్ కొండయ్య గారి నివాసంలో ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ శ్రీ జూపూడి ప్రభాకర రావు గారు ఆత్మీయంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, సామాజిక న్యాయం, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై నాయకులు పరస్పరం చర్చించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాలని జూపూడి ప్రభాకర రావు గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ గ్యాస్ కొండయ్య గారు, శ్రీ పువ్వాడ రమణయ్య గారు,బీవీ గారు కొండలు, శ్రీరాములు, కిష్టయ్య, చొప్పరి వెంకన్న, జూగుంట రమేష్ బాబు, జూగుంట మనోహర్, బంటుపల్లి రాజు, లక్ష్మీరాజు, సీహెచ్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *