త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా… ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు శనివారం కీలక సమావేశం నిర్వహించారు.
పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ మరియు యూనిటీ ఇన్చార్జిలకు దిశానిర్దేశం చేశారు. MLA గారు మాట్లాడుతూ… రెండేళ్లలో నియోజవర్గంలో భారీ ఎత్తున చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది. అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఏ ఊరికి ఏం చేశామో… ప్రజల్లోకి వెళ్లి గర్వంగా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో కూటమి పార్టీల అభ్యర్థులు గెలవాలి. ఇప్పటినుంచే నాయకులందరూ ఐక్యమత్యంతో గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని, ఎన్నికల్లో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి.గత ఎన్నికల్లో కష్టపడ్డ చాలామంది నేతలు, కార్యకర్తలకు మనం అండగా నిలిచాం. పదవులు, పనులు ఇచ్చాం. రాబోయే రెండున్నర ఏళ్లలో మిగిలిన వారికి కూడా తప్పక న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. మనమంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. గ్రామస్థాయిలో బలంగా కూడా ఉన్నాం. కానీ ఈ సమయంలో గ్రామాల్లో, వైసిపి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి ఆమోదం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంకా కొత్త ఓట్లు చేర్చడంపై నేతలు దృష్టి పెట్టాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా చేర్చండి… అని ఇంటూరి నాగేశ్వరావు గారు సూచించారు. ఇంకా పలు అంశాలపై సూచనలు చేశారు.

ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీల అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, మాదాల లక్ష్మీనరసింహం, పట్టణ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీను, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *