ముండ్లమూరు మండలం వేముల గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో దాత కోటి గారి సహకారంతో 30 మంది విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పంపిణీ చేశారు. పాఠశాలకు దూరంగా ఉండే విద్యార్థులు సకాలంలో బడికి చేరుకోవడానికి ఈ సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని సూచించారు.విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడంతో పాటు, మెరుగైన మౌలిక వసతులు కల్పించి ప్రతి పేద విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.విద్యార్థుల కలలకు సైకిళ్ల వేగం…
వారి భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వ భరోసా..!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *