దర్శి మున్సిపాలిటీ పరిధిలోని 3, 4వ వార్డుల్లో సుమారు రూ.57 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, కమిషనర్ కె. అర్జున్ రావు గారితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో దర్శి పట్టణంలో దాదాపు రూ.10 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఒకప్పుడు నగర పంచాయతీగా ఉన్న దర్శిని గ్రేడ్-3 మున్సిపాలిటీగా మార్చుకున్నామని పేర్కొన్నారు.రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులతో పాటు అమృత్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు, టీటీడీ కళ్యాణ మండపం, అన్న క్యాంటీన్, మినీ స్టేడియం, క్రికెట్ స్టేడియం, పార్కు అభివృద్ధి, కోల్డ్ స్టోరేజ్, డిగ్రీ కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.సంక్షేమం–అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రతి గడపకు అభివృద్ధి ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి, దర్శి అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గర్నిపూడి స్టీవెన్, కౌన్సిలర్ ఇత్తడి సునీత దినకర్, దర్శి మండల & టౌన్ టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, చిన్నా, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *