ఉలవపాడులో పలు అభివృద్ధి పనులకు గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు శనివారం సాయంత్రం ప్రారంభోత్సవాలు చేశారు.నేషనల్ హెల్త్ మిషన్ క్రింద 11 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్….స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 3 లక్షలతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్…స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ క్రింద 16 లక్షలతో ఏర్పాటుచేసిన మిషనరీని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్య భద్రత, పరిశుభ్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు స్థానికంగానే వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మిషనరీ ప్లాంట్ ఏర్పాటుద్వారా ఉలవపాడులో సంపూర్ణ పారిశుధ్య వాతావరణం ఏర్పడుతుందని ఎమ్మెల్యే వివరించారు. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి, ప్రాసెస్ చేయడం ద్వారా గ్రామంలో చెత్త సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కలుగుతుందన్నారు. పారిశుధ్యం పై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్, మండల టిడిపి అధ్యక్షుడు రాచగర్ల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి సుదర్శి శ్రీనివాసులు, ఏఎంసి డైరెక్టర్ అమ్మనబ్రోలు మాధవ, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శులు మద్దసాని మహేంద్ర, దార్ల యలమందమ్మ, క్లస్టర్ ఇన్చార్జి పోలుబోయిన శ్రీనివాసులు, పార్టీ నాయకులు బొడ్డు ప్రసాద్, గంటా కృష్ణ, రాచగర్ల శివ, చెంచురామిరెడ్డి, ఖాదర్ బాషా, మర్రిబోయిన శ్రీహరి, అంచుపోగు వాసు, తొట్టెంపూడి మాల్యాద్రి, సన్నెబోయిన ప్రభావతి, షేక్ రఫీ, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *