తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన అన్నప్రసాద షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాను.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నాను.భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తాను.