ఏ.పీ.జేఏసీ అమరావతి పిలుపు మేరకు ఉద్యోగుల హక్కుల సాధనలో భాగంగా ఈ రోజు కందుకూరు డివిజన్‌లోని వివిధ శాఖల ఉద్యోగులు కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యమ కార్యాచరణ నోటీసును ట్రైనీ ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ శ్రీ రాజా మాథ్యూ గారికి అందజేశారు.ఉద్యోగులకు సంబంధించిన DA బకాయిల విడుదల, PRC అమలు మరియు ఉద్యోగుల ఇతర న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఏ.పీ.జేఏసీ అమరావతి చేపట్టిన ఉద్యమ కార్యాచరణకు ఉద్యోగులు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ.పీ.జేఏసీ కందుకూరు డివిజన్ చైర్మన్, అధ్యక్షులు, కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగుల అధ్యక్షులు మరియు కార్యదర్శులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, APSRTC ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.అందరూ ఐక్యంగా తరలివెళ్లి ఉద్యమ కార్యాచరణ నోటీసు ప్రతిని అందజేశారు.ఈ సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ విజయ భాస్కర్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా DA బకాయిలను విడుదల చేయాలని, PRC కమిషన్‌ను నియమించి వెంటనే IR (మధ్యంతర భృతి) ప్రకటించాలని, సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులపై చర్యలు తీసుకోవాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.DA బకాయిలు విడుదల చేయాలనీ
PRC అమలు చేయాలనీ
PRC కమిషన్‌ను వెంటనే నియమించాలనీ
IR (మధ్యంతర భృతి) ప్రకటించాలనీ
సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై చర్యలు తీసుకోవాలనీ
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలినీ
ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలనీ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఏపీ జేఏసీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో కందుకూరు డివిజన్‌లోని ప్రతి ఒక్క ఉద్యోగి తూచా తప్పకుండా పాల్గొని, ఉద్యోగుల హక్కులు సాధించే వరకు ఉద్యమ కార్యాచరణలో నిర్ణయించిన కార్యక్రమాల ప్రకారం ప్రతి ఒక్క ఉద్యగి బాధ్యతగా వారి కుటుంబ సంక్షేమం కొరకు పాల్గొని ఉద్యోగుల ఐక్యతను చాటాలని కోరి ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *