విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా గిద్దలూరు సీఐ గారు రాచర్ల మండలం యాదవల్లి ఎక్స్‌ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల పత్రాలు, వాహనాల పరిస్థితులను పరిశీలిస్తూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని సూచించారు.ఈ సందర్భంగా వాహనదారులు, ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్‌ నేరాలు, దొంగతనాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, OTPలు మరియు వ్యక్తిగత బ్యాంకింగ్‌ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు.అదేవిధంగా దొంగతనాల నివారణకు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రజల భద్రతే లక్ష్యం – విజిబుల్‌ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణకు నిరంతర చర్యలు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *