తొలి శుభోదయం న్యూస్ పొదిలి:-
సమాజంలో మానవ హక్కుల రక్షణ, న్యాయ సాధన మరియు పౌర స్వేచ్ఛ పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ అయిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ఫర్ జస్టిస్ అండ్ సివిల్ లిబర్టీ సంస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ వ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను, ప్రజా సమస్యలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా ప్రతినిధిగా పొదిలికి చెందిన పట్నం శ్రీనివాసులు నియమితులయ్యారు.
సంస్థ ఉన్నత వర్గాల ఆదేశాల మేరకు శ్రీనివాసులు ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం పట్ల పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలకు అండగా నిలవడంలోనూ, హక్కుల పరిరక్షణలోనూ మీడియా పాత్ర అత్యంత కీలకమని, పట్నం శ్రీనివాసులు తన సమర్థతతో ఈ బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తారని పలువురు కొనియాడారు.
ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, బాధితులకు న్యాయం అందించే దిశగా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మీడియా ప్రతినిధిగా తన వంతు పూర్తి కృషి చేస్తానని శ్రీనివాసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.