తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘ఫేస్ వాష్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పాత నేరస్తులు, అనుమానితులు మరియు నేర కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా సంబంధిత వ్యక్తుల వివరాలు, ప్రస్తుత కార్యకలాపాలు, నివాస పరిస్థితులు, వారి ప్రవర్తన తదితర అంశాలను పరిశీలించారు. నేరాలకు దూరంగా ఉండి శాంతియుతంగా జీవించాలని సూచిస్తూ అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు, చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు, నిరంతర పర్యవేక్షణ, విజిబుల్‌ పోలీసింగ్‌ ద్వారా ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు పోలీస్‌ శాఖ కృషి చేస్తోంది.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి నేర నియంత్రణలో సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.నేర నియంత్రణే లక్ష్యం – ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *