తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
తర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మురుగునీరు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, గురువారం ఉదయం వసతి గృహం పరిసర ప్రాంతంలో ఓ కుక్కపిల్ల మృతి చెంది అక్కడే పడివుండటంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మృతి చెందిన కుక్కను తొలగించేందుకు ఇప్పటివరకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వసతి గృహంలో విద్యార్థులు ఉంటున్న నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తక్షణమే డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, మృతి చెందిన కుక్కను తొలగించాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు స్పందించి వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు…..