ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ద‌ర్శి డీఎస్పీ గారు, ఒంగోలు డీఎస్పీ గారు తమ సబ్‌డివిజన్ల పరిధిలో 90 రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేయాల్సిన కేసులు, 90 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న గుర్తించిన కేసులపై ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించారు.ద‌ర్శి డీఎస్పీ గారు పరిధిలోని 90 రోజుల చార్జిషీట్‌ కేసులకు సంబంధించి మొత్తం 8 కేసులను సమీక్షించారు. వీటిలో 2 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా, 3 కేసులు RFSL నివేదికల కోసం పెండింగ్‌లో ఉన్నాయి, 2 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి. మరో 1 కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.అదేవిధంగా ఒంగోలు డీఎస్పీ గారు సబ్‌డివిజన్‌ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలతో సమావేశం నిర్వహించి, 90 రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేయాల్సిన కేసులు మరియు 90 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న గుర్తించిన కేసుల స్థితిగతులపై సమీక్షించారు.దర్యాప్తుల్లో జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టి, పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ఆధారాలను సేకరించి నాణ్యమైన దర్యాప్తు పూర్తి చేసి నిర్ణీత సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులకు సూచించారు.కేసుల దర్యాప్తులో వేగం – న్యాయ ప్రక్రియలో పారదర్శకత – బాధితులకు సత్వర న్యాయం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్‌ శాఖ నిరంతరం కృషి చేస్తోంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *